చిరు తర్వాత బాలయ్యతో డైరెక్టర్ అనిల్ సినిమా..?

చిరు తర్వాత బాలయ్యతో డైరెక్టర్ అనిల్ సినిమా..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమాల్లో హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే, హీరో చిరంజీవి సినిమా తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాని నందమూరి బాలకృష్ణతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ సినిమా  వచ్చింది. ఇది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీంతో అనిల్‌తో బాలయ్య మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఈ క్రమంలోనే అనిల్‌తో తన నెక్స్ట్ సినిమాని చేసేందుకు బాలయ్య రెడీగా ఉన్నాడట.

editor

Related Articles