‘ఆర్య’ సినిమాతో దర్శకుడు సుకుమార్‌ను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత దిల్ రాజు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఆర్య’ సినిమా తరువాత దిల్ రాజు- సుకుమార్ కాంబోలో మరో సినిమా తీయలేదు. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా పుష్ప-2 ది రూల్ ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఒకవైపు షూటింగ్‌తో పాటు మరోవైపు నిర్మాణానంతర పనులతో తలమునకలై వున్నాడు ఈ దర్శకుడు. తాను సుకుమార్ రైటింగ్స్‌తో అసోసియేషన్‌తో నిర్మిస్తున్న ‘సెల్ఫిష్’ సినిమా చిత్రీకరణను ఆపేశానని తెలియజేశారు దిల్‌రాజు. వివరాల్లోకి వెళితే.. దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వంలో సెల్పిష్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దిల్‌రాజు. ఇప్పటివరకు యాభై శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం బ్యాలెన్స్ వర్క్ పుష్ప-2 విడుదల తరువాత మళ్లీ మొదలుపెడతానని తెలియజేశారు దిల్ రాజు. పుష్ప-2 రిలీజ్ తరువాత సుకుమార్ ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొంటాడని, ఆయన సలహాలు, సూచనలతో మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

- November 12, 2024
0
24
Less than a minute
Tags:
You can share this post!
administrator