తంతే బూరెలబుట్టలో పడింది శ్రీనిధి శెట్టి?

తంతే బూరెలబుట్టలో పడింది శ్రీనిధి శెట్టి?

‘కేజీఎఫ్‌’ నటిగా దేశానికి పరిచయమైంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత అవకాశాలు కూడా ఈ కన్నడ కస్తూరిని బాగానే వరించాయి. కానీ శ్రీనిధి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోలేదు. నచ్చిన సినిమాకు మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చియాన్‌ విక్రమ్‌తో ‘కోబ్రా’ సినిమాలో నటించిందీ ఈ హీరోయిన్. ఆ సినిమా తనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయితే.. రీసెంట్‌గా వచ్చిన ‘హిట్‌ 3’తో మళ్లీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రీనిధి శెట్టి. ఇదిలావుంటే.. ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో శ్రీనిధి శెట్టికి సంబంధించిన ఓ వార్త బలంగా వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఎంపికైందనేది ఈ వార్త సారాంశం. ఈ కథలో ముగ్గురు హీరోయిన్లకు చోటున్నదట. అందులో మెయిన్‌ హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇదే గనుక నిజమైతే ఈ హీరోయిన్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.

editor

Related Articles