హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ల మధ్య డ్యాన్స్‌ వార్‌!

హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ల మధ్య డ్యాన్స్‌ వార్‌!

హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు.. వీళ్లు కాలు కదిపితే చాలు థియేటర్లో విజిల్స్‌ మోగాల్సిందే. అలాంటిది ఏకంగా వీరిద్దరూ కలిసి నువ్వా నేనా అనే రేంజ్‌లో డ్యాన్స్‌లో పోటీపడితే ఇక ఆ పోరు ఆద్యంతం రక్తికట్టాల్సిందే. అందుకు ‘వార్‌-2’ సినిమా వేదిక కాబోతోంది. హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘వార్‌-2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పాటను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తారట. ఇద్దరు బెస్ట్‌ డ్యాన్సర్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో ఈ పాటను చూస్తే అర్థమవుతుందని బాలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నెలలోనే ఈ పాటను తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది జూన్, జులైల్లో ‘వార్‌-2’ ప్రేక్షకుల ముందుకురానుంది.

Latest updates: కంగనా రనౌత్ ఫ్యామిలీతో కలిసి మనాలి రెస్టారెంట్ ఓపెనింగ్..

editor

Related Articles