టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తోంది. రవితేజ మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌గా వస్తున్న సినిమా ‘కాంత’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి నిర్మాతలు ఇప్పటికే దుల్కర్ ఫస్ట్‌లుక్‌ని పంచుకోగా.. దుల్కర్ రెట్రో స్టైల్‌లో అలరిస్తున్నాడు. అయితే వాలంటైన్స్ డే కానుకగా తాజాగా భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

- February 14, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor