విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా టైటిల్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్ట్ చేయనున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొద్దిరోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సామ్రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐతే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనని, టైటిల్ గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

- February 7, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor