బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ల అంతర్మత వివాహం వివాదానికి దారితీసింది. జులై 5న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై ఇరు మత వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య, ఆమిర్ ఖాన్‌ను హత్య చేసిన వారికి రూ.5 కోట్ల బహుమతి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు నేపథ్యంగా నిలిచాయి. అలాగే కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ కూడా ఈ వివాహానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం సరికాదని, ఆమిర్ ఖాన్ పశ్చాత్తాపం చెందాలని పేర్కొన్నారు. అయితే చట్టబద్ధంగా, పరస్పర అంగీకారంతో జరిగిన ఈ వివాహంపై ఇరువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాలపై ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ఇప్పటివరకు స్పందించలేదు.

