నిర్మాత KP చౌదరి (కృష్ణప్రసాద్) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న KP చౌదరి గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన నిర్జీవంగా కనిపించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. KP చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. హీరో రజినీకాంత్ నటించిన కబాలి సినిమా తెలుగు వెర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత చౌదరికి కలిసి రాకపోవడంతో గోవాలో ఓమ్ పబ్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంతా లాస్ రావడంతో దివాళా తీశారు.

- February 3, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor