ఓటీటీల వ‌ల్లనే కలెక్షన్లు పడిపోయాయి: అమీర్‌ఖాన్

ఓటీటీల వ‌ల్లనే కలెక్షన్లు పడిపోయాయి: అమీర్‌ఖాన్

బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఓటీటీ వేదికలపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఓటీటీల వ‌ల‌న ప్రేక్ష‌కులు థియేటర్లకు రావ‌డం మానేసార‌ని తెలిపారు. ఇది సినిమా వ్యాపారానికి ఏ మాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ‘వేవ్స్’ కార్యక్రమంలో ‘ఇండియన్ సినిమా, ఓరియంటల్ లుక్’ అనే అంశంపై అమీర్‌ఖాన్ మాట్లాడుతూ ఓటీటీపై తన అభిప్రాయాలను షేర్ చేశారు. అమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. “ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా టీవీలో ప్రసారం కావడానికి దాదాపు ఏడు నుండి ఎనిమిది నెలల కాలం పట్టేది. మనం పరోక్షంగా ప్రేక్షకులను థియేటర్లకు రావద్దని చెబుతున్నాము. దీనివల్లే చాలా సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

editor

Related Articles