బాలయ్య బాబుకి పౌర స‌న్మాన స‌భ హిందూపురంలో..

బాలయ్య బాబుకి పౌర స‌న్మాన స‌భ హిందూపురంలో..

నంద‌మూరి బాల‌కృష్ణ  రీసెంట్‌గా ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ప‌ద్మ భూష‌ణ్ అవార్డ్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపురంలో ఆయ‌నకి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌరసన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జ‌రిగింది. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు. సినిమా ఈవెంట్ కంటే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధ‌న్య‌వాదాలు. నేను భగవంతుడికి అభిమానులకు మధ్య సందానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారు. నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీవాడిలా మీలో ఒకడిగా మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధ‌న్య‌వాదాలు. నా గుండెల్లో మీరంతా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అని బాల‌య్య అన్నారు. నాన్న శతజయంతి జరపుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టడం..

editor

Related Articles