సమంత – వరుణ్ ధావన్ నటించిన స్పై థ్రిల్లర్ వెబ్‌సిరాస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌కు అరుదైన ఘనత దక్కింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఈ వెబ్‌సిరీస్ నామినేట్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు తన ఆనందం షేర్ చేశారు.ఈ అవార్డుల వేడుక 2025 ఏడాదిలో జనవరి 12న జరగనున్నట్లు వెల్లడించారు.
అమెజాన్ ప్రైమ్ OTTలో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ అధిక వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఈ సిరీస్ గురించి సమంత మాట్లాడుతూ తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు చేసిన ఈ సిరీస్ సెట్‌లో కష్టతరమైన రోజులను గర్తుచేసుకున్నారు.