నెత్తుటితో పిడికిలి బిగించిన చిరంజీవి, శ్రీకాంత్‌ ఓదెల..

నెత్తుటితో పిడికిలి బిగించిన చిరంజీవి, శ్రీకాంత్‌ ఓదెల..

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న హీరో చిరంజీవి. మరోవైపు దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా అప్‌డేట్ ఇచ్చేశారో లేదో..? సినిమా ఎలా ఉండబోతోందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు స్టన్నింగ్ ఫొటోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. మెగాస్టార్ చిరంజీవితో పిడికిలి బిగించిన స్టిల్‌ను షేర్ చేశాడు. బ్యాక్‌డ్రాప్‌లో చిరు, శ్రీకాంత్‌ ముఖాలను కనిపించకుండా.. నెత్తుటితో పిడికిలి బిగించిన స్టిల్‌ను హైలెట్‌ చేస్తూ తీసిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. సినిమా వయోలెన్స్‌గా (హింసాత్మకంగా) ఉండబోతుందని ట్వీట్‌ చేశాడు. ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల ఓ వైపు నానితో రెండో సినిమాను డైరెక్ట్ చేస్తూనే.. మరోవైపు మెగాస్టార్ సినిమాను లైన్‌లో పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. హై బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని చాలా ఫ్రెస్‌ లుక్‌తో కనబడబోతున్నారట.

editor

Related Articles