‘డ్రాగన్‌’ సినిమా పేరుగా ఖరారు చేసే అవకాశం?

‘డ్రాగన్‌’ సినిమా పేరుగా ఖరారు చేసే అవకాశం?

‘దేవర’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు జూ.ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన హిందీ సినిమా ‘వార్‌-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హృతిక్‌రోషన్‌ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌పై పాన్‌ ఇండియా స్థాయిలో ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌నీల్‌ డైరెక్ట్‌ చేయబోయే ప్రాజెక్ట్‌లో జాయిన్‌ కాబోతున్నారు ఎన్టీఆర్‌. ప్రీప్రొడక్షన్‌ పనులు శరవేగంగా ఊపందుకున్నాయని, ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ప్రశాంత్‌నీల్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా వెల్లడించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం కూడా ఇదే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ సస్పెన్స్‌ వీడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయండి. ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం.

editor

Related Articles