మహాభారతంలో అర్జునుడి పాత్రకు బన్నీ?

మహాభారతంలో అర్జునుడి పాత్రకు బన్నీ?

బన్నీ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న లెజెండరీ యాక్టర్ల దృక్కోణంలో కూడా మార్పు వచ్చింది. జాతీయ ఉత్తమనటుడిగా ఎంపిక కావడం, లెజెండ్‌ అమితాబ్‌ సైతం బన్నీని పొగడటం ఇవ్వన్నీ కూడా అందుకు కారణాలు కావొచ్చు. దేశంలో వందల కోట్లతో నిర్మించే భారీ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు బన్నీవైపు చూస్తున్నాయి. రీసెంట్‌గా అట్లీ సినిమా పనిమీద ముంబయ్‌ వెళ్లిన బన్నీని.. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ కలిశారు. ఇది పూర్తిగా ప్రొఫెనల్‌ మీటింగ్‌ అని తెలుస్తోంది. అమీర్‌ఖాన్‌ తన ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ కోసమే అల్లు అర్జున్‌ని కలిశారని బీటౌన్‌ టాక్‌. ఇందులో శ్రీకృష్ణుడిగా తానే నటిస్తానని అమీర్‌ఖాన్‌ గతంలోనే ప్రకటించారు. ఈ ప్రెస్టేజియస్‌ ప్రాజెక్ట్‌లో అర్జునుడి పాత్రను బన్నీతో చేయించాలని అమీర్‌ఖాన్‌ భావిస్తున్నారట. అందుకే బన్నీని ఆయన కలిశారట. ఈ సినిమాను ఐదు భాగాలుగా తీయాలనేది అమీర్‌ డ్రీమ్‌. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తొలి భాగాన్ని సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తారట. ఈ మధ్యకాలంలో సంజయ్‌ కూడా ఒకటి రెండుసార్లు ముంబయ్‌లో బన్నీని కలిశారు. దీంతో ‘మహాభారత్‌’ ప్రాజెక్ట్‌ కోసమే ఈ మీటింగులని తెలుస్తోంది.

editor

Related Articles