ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు హీరో మహేష్‌బాబు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం ఇటీవలే కొంచెం బ్రేక్ తీసుకుంది. జూన్‌లో మరో షెడ్యూల్‌ను మొదలుపెడతారని సమాచారం. ఇదిలావుండగా రాజమౌళి సినిమా అనంతరం మహేష్‌బాబు సినిమా ఏమిటి? ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమా చేస్తారని సమాచారం. మహేష్‌బాబు ‘వన్’ సినిమాకు బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటి నుండే ఇద్దరికి సాన్నిహిత్యం ఉంది. ‘ఉప్పెన’ రిలీజ్ తర్వాత బుచ్చిబాబు వర్క్ బాగా నచ్చడంతో ‘మంచి కథ సిద్ధం చేసుకో. సినిమా చేద్దాం’ అని మాటిచ్చారట మహేష్‌బాబు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ చిత్రాన్ని చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇది పూర్తయిన వెంటనే మహేష్‌బాబుతో సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు.
- May 8, 2025
0
193
Less than a minute
Tags:
You can share this post!
editor

