మధురై ఎయిర్పోర్ట్ వద్ద దళపతి విజయ్ను కలవడానికి వచ్చిన ఒక అభిమానిపై విజయ్ బాడీగార్డ్ తుపాకీ గురిపెట్టిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ తన తదుపరి సినిమా జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. విజయ్ మధురై ఎయిర్పోర్ట్కి రాబోతుండగా.. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి విజయ్ కారుని అనుసరించారు. ఈ క్రమంలో, ఒక అభిమాని విజయ్ను సమీపించే ప్రయత్నం చేయగా, బాడీగార్డ్ అతణ్ణి కట్టడి చేద్దామని భావించి తుపాకీ ఎక్కుపెట్టాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాడీగార్డ్ చర్యలను సమర్థిస్తుండగా, మరికొందరు అంతగా స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. తుపాకీ గురిపెట్టిన అభిమాని మాట్లాడుతూ, భద్రతా సిబ్బంది తనను విజయ్ రక్షణ కోసమే అలా చేశారని, వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. మరోవైపు, విజయ్ భద్రతా సిబ్బంది మాత్రం ఆ సమయంలో అభిమాని ఒక్కసారిగా దగ్గరకు రావడంతో ఆయుధాన్ని జాగ్రత్తల కోసం అలా ఉంచడం జరిగిందని తెలిపారు.
- May 6, 2025
0
67
Less than a minute
You can share this post!
editor

