బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌కు తృటిలో తప్పిన రోడ్ యాక్సిడెంట్

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌కు తృటిలో తప్పిన రోడ్ యాక్సిడెంట్

బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రోడ్డు యాక్సిడెంట్‌కి గురైంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ఐంది. శుభశ్రీ గురించి టాలీవుడ్‌లో తెలియ‌నివారుండ‌రు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7 ద్వారా ఈ భామ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ షో ద్వారా మంచి పేరు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తోంది. రీసెంట్‌గా ఈమె చేసిన కాకినాడ కాజా సాంగ్ సోష‌ల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది. అయితే ఈ భామ ఓ సినిమా షూటింగ్‌కు వెళుతుండ‌గా దారి మధ్యలో యాక్సిడెంట్.. ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. నిన్న 6వ తేదీ మ.2 గంటల సమయంలో నాగార్జునసాగర్‌లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వ‌స్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అదుపుత‌ప్పి కారును ఢీకొట్టారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయలు కాగా, బిగ్ బాస్ బ్యూటీ తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుని బయట పడింది.

editor

Related Articles