ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులను కూడా ఆలోచింప చేస్తున్నాయి. ఇప్పటికే ‘స్పిరిట్’లో సైఫ్‌అలీఖాన్, కరీనాకపూర్ నటిస్తున్నారనీ, ఈ భార్యభర్తలిద్దరూ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. వాటిని నిజం చేస్తూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవలే ఈ జంటను కలిశారు. వారికి కథ, పాత్రలు కూడా చెప్పినట్లు బీటౌన్ సమాచారం.
ఇప్పుడు ఏకంగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో యాక్ట్ చేస్తారన్న విషయం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటివరకూ వీటిపై అధికారిక ప్రకటనలు మాత్రం ఇంకా రాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలౌతుందని అంటున్నారు. సందీప్‌రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్, వైల్డ్ ఎలిమెంట్స్‌తో హాలీవుడ్ స్థాయిలో ‘స్పిరిట్’ తెరకెక్కనున్నదనీ, దాదాపు 400 కోట్ల బడ్జెట్ సినిమా వ్యయంతో సందీప్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. టి.సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చుతారు.