అమ్మతో బ్యూటిఫుల్ మార్నింగ్‌.. ముచ్చటించిన అల్లు అర్జున్‌

అమ్మతో బ్యూటిఫుల్ మార్నింగ్‌.. ముచ్చటించిన అల్లు అర్జున్‌

 హీరో అల్లు అర్జున్‌  టైటిల్‌ రోల్‌లో నటించిన పుష్ప 2 ది రూల్‌. సుకుమార్‌ కాంపౌండ్‌ నుండి వచ్చిన ఈ సినిమా డిసెంబర్‌ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఓపెనింగ్‌ డే నుండి నేటి వరకు వసూళ్ల వర్షంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమా కేవలం 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల కలెక్షన్ల దాటిపోయింది. ఈ నేపథ్యంలో విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ టీం ఢిల్లీకి పయనమైంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయాన్నే తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. ఎంత అందమైన ఉదయం.. బిగ్ డే.. అందమైన ప్రారంభం.. అంటూ క్యాప్షన్‌ పెట్టాడు.

అద్భుతమైన విజయాన్ని అందుకున్న కొడుకును చూసి నిర్మల గర్వంగా ఫీలవుతూ సంతోషంగా కనిపించగా.. మరోవైపు తన తల్లిని చూసి ఆనందంలో మునిగిపోయాడు బన్నీ. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

editor

Related Articles