బాలకృష్ణ డాకు మహారాజ్‌ దబిడి దిబిడి సాంగ్‌ ఇవాళ సా.5:16 కు లాంచ్…

బాలకృష్ణ డాకు మహారాజ్‌ దబిడి దిబిడి సాంగ్‌ ఇవాళ సా.5:16 కు లాంచ్…

బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా డాకు మహారాజ్‌. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. సింహా సినిమాలో దబిడి దిబిడే అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పే డైలాగ్‌ ఏ రేంజ్‌లో ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే డైలాగ్‌ను పాటగా మార్చేసి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఎన్‌బీకే 109 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. తాజాగా డాకు మహారాజ్‌ థర్డ్‌ సింగిల్ దబిడి దిబిడి సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 5:16 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ లుక్ విడుదల చేశారు. అన్‌స్టాపబుల్‌ మాస్ బ్లాస్ట్‌ సాంగ్‌లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా స్టైలిష్ మాస్‌ డ్యాన్స్‌ ఉండబోతున్నట్టు లుక్‌ చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్‌, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

editor

Related Articles