చిరంజీవి సినిమా 2026 సంక్రాంతికి విడుదల..

చిరంజీవి సినిమా 2026 సంక్రాంతికి విడుదల..

చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ఐతే, ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. నిన్న సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెగాస్టార్‌తో తీయబోయే సినిమా స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు చేశాం. సినిమా కథలు రాయడానికి నేను వైజాగ్‌ను సెంటిమెంట్‌గా భావిస్తాను, అందుకే ప్రతి స్క్రిప్ట్ ఇక్కడే పూజలు చేయిస్తాను అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందట. అన్నట్టు ఈ సినిమా గురించి ఆ మధ్య మెగాస్టార్ మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా అని.. ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

editor

Related Articles