తమన్నా-విజయ్‌వర్మల మధ్య మనస్ఫర్థలు నిజమేనా?

తమన్నా-విజయ్‌వర్మల మధ్య మనస్ఫర్థలు నిజమేనా?

హీరోయిన్ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ గత రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌ కోసం పనిచేస్తున్న ఈ జంట ప్రేమలోపడ్డారు. తమ లవ్‌ఎఫైర్‌ గురించి అనేక సందర్భాల్లో ఈ జంట మాట్లాడారు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకు వృత్తిపరమైన అంశాల కారణమని అంటున్నారు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లిచేసుకుని జీవితంలో సెటిల్‌ కావాలన్నది తమన్నా ఆలోచనగా ఉందని, విజయ్‌వర్మ మాత్రం పెళ్లి ప్రస్తావన లేకుండా మరికొంతకాలం నటనపైనే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలో వారిమధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఈ జంట పెదవి విప్పలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుందని, అంతవరకు ఈ వార్తలను గాసిప్స్‌గానే భావించాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ‘ఓదెల-2’ సినిమాలో నటిస్తోంది.

editor

Related Articles