హీరో రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగా, సుకుమార్‌తో చేయనున్న సినిమాకి సంబంధించి కసరత్తులు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. రంగస్థలం కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ స్టేటస్ కూడా పెరిగింది. ఇక సమంత విషయానికి వస్తే ఈ హీరోయిన్ ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీసులు చేయడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇక ఇందులో రష్మిక మందన్న కూడా నటిస్తోందని టాక్. ఆమెకి ఈ మధ్య వరుస హిట్స్ రావడంతో ఆమె క్రేజ్ కూడా మరింతగా పెరిగింది. మరి ఇంత పాపులారిటీ ఆర్టిస్ట్‌లు అందరు కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరి ముగ్గురికి జాతీయ స్థాయిలో, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు సినిమా చేస్తున్నారని తెలిసి విశ్లేషకులు కూడా సినిమాకి సంబంధించి అనేక లెక్కలు వేసుకుంటున్నారు. చరణ్ కోసం సుకుమార్ తొలిసారి తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి రష్మికని తీసుకున్నాడట. రష్మిక సుకుమార్‌తో కలిసి పుష్ప, పుష్ప2 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే.

- March 7, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor