త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న వీర ధీర సూరన్‌-2

త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న  వీర ధీర సూరన్‌-2

హీరో విక్రమ్‌ నటిస్తున్న సినిమా ‘వీర ధీర సూరన్‌ పార్ట్‌2’. ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకుడు. రియా శిబు నిర్మాత. ఎస్‌.జె.సూర్య, సూరజ్‌ వెంజరాముడు, దుషార విజయన్‌ కీలక పాత్రధారులు. ప్రేక్షకులకు సీట్‌ ఎడ్జ్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని, ప్రమోషనల్‌ కంటెంట్‌కి మంచి స్పందన వస్తోందని, ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తేని ఈశ్వర్‌, సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌కుమార్‌ దర్శకుడు. ఎన్వీఆర్‌ సినిమాస్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

editor

Related Articles