బ్లాక్‌బస్టర్ ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుండి వస్తున్న సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మంగళవారం నిర్మాతలు విడుదల చేశారు. యూత్‌కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తోపాటు వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ట్రైలర్ ఆద్యంతం సాగింది. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకునీ.. కాలేజీలో పనీపాట లేకుండా గాలికి తిరిగే కుర్రాడిగా ప్రదీప్ రంగనాథన్ ఈ ట్రైలర్‌లో కనిపించారు.

- February 12, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor