‘లైలా’ సినిమా వివాదంకు సంబంధించి మరోసారి స్పందించిన హీరో విష్వక్ సేన్. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా అభిమానులు అతడిని ట్రోల్ చేయడంతో పాటు లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తామని ఎక్స్‌లో ట్రెండ్ చేశారు. దీంతో దిగొచ్చిన చిత్రబృందం క్షమాపణలు తెలిపింది. నా సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఫొటోలు చాలా పాతవి. అవి నెల కిందట విడుదల చేసినవి. ఈ పోస్టర్లు సినిమాకు సంబంధించినవి మాత్రమే. ఈ ఫొటోల్లో ఉన్నది సోనూ మోడల్. ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి ఇప్పటికే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. ఈ విషయంలో అతిగా ఆలోచించకండి.. నేను నటుడిని మాత్రమే నన్ను నా సినిమాని రాజకీయల్లోకి లాగకండి అంటూ విష్వక్ సేన్ రాసుకొచ్చాడు.

- February 12, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor