చీరలో ఉన్న ఆమెతో ప్రేమలో పడిన ఓ అబ్బాయి కథే.. RGV ‘శారీ’…

చీరలో ఉన్న ఆమెతో ప్రేమలో పడిన ఓ అబ్బాయి కథే.. RGV ‘శారీ’…

డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ సారథ్యంలో వ‌స్తున్న సినిమా శారీ ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు నిర్మాతలు. యథార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా వ‌స్తున్న ఈ సినిమాలో ఆరాధ్య దేవి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వ‌ర్మ ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌గా.. గిరి కృష్ణ‌క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆర్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవివర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా మారింది అనేది స్టోరీలో తెలుస్తుంది.

editor

Related Articles