ప్రశాంత్ వర్మతో మరో సీక్వెల్: తేజ సజ్జ?

ప్రశాంత్ వర్మతో మరో సీక్వెల్: తేజ సజ్జ?

మన టాలీవుడ్‌లో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన భారీ హిట్ సినిమా “హనుమాన్” గురించి అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మరి ఈ సినిమాకి గ్రాండ్ సీక్వెల్‌గా “జై హనుమాన్” ని కూడా ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సీక్వెల్ కాకుండా ఇదే కాంబినేషన్ నుండి మరో మ్యాడ్ సీక్వెల్ వస్తుంది అని తెలుస్తోంది. హనుమాన్ కంటే ముందు వచ్చిన క్రేజీ సినిమా “జాంబీ రెడ్డి” ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా వచ్చి నిన్నటితో నాలుగేళ్లు పూర్తయింది. అయితే ఈ సినిమాకే ఇప్పుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జలు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే తేజ చేసిన సస్పెన్స్ పోస్ట్ కూడా వైరల్‌ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తుందా అనేది వేచి చూడాలి మరి.

editor

Related Articles