ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాల్సిందే లేకుంటే విడాకులే!

ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాల్సిందే లేకుంటే విడాకులే!

ప్రేమలో రెండుసార్లు ఫెయిలైన కారణంగా మనశ్శాంతిని కోల్పోయినట్లుంది శ్రుతిహాసన్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్‌, పెళ్లి అనే అంశాలపై ఆమె ప్రస్థావించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అభిప్రాయబేధాల వల్ల అంతరాలు పెరుగుతున్నప్పుడు ఓ బాధ. విడిపోయిన తర్వాత ఓ బాధ. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. పెళ్లి అనే కట్టుబాటు బంధాలను శాశ్వతం చేస్తుందంటే కూడా నేను నమ్మను. ఎవర్నీ బలవంతంగా కలిపి ఉంచలేం. మా అమ్మానాన్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. చాలా అందమైన జంట. ఈ ప్రపంచంలో ఉత్తమ జంట మా అమ్మానాన్నే అనుకునేదాన్ని. ఇద్దరూ చాలాకాలం కలిసున్నారు. ఆ టైమ్‌లో మా ఇల్లు చాలా సందడిగా వుండేది. ఉన్నట్టుండి విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు. కానీ కుదర్లేదు. పరిస్థితులకు ఎదురొడ్డి గెలవలేం. ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బంధాలు నిలవవ్‌. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లేవ్‌. ఓర్పు సహనాలు మనుషుల మధ్య నశించాయి, ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇగో ప్రాబ్లమ్ ఉంటోంది, అలాంటి జంటలు విడుకులకై కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఇది మన భారతీయ సంతతికి అంత మంచిది కాదు. ఇకనైనా మేల్కోండి యువతీ యువకులారా చక్కని సంప్రదాయానికి శ్రీకారం చుట్టండి అదే మన హిందూ సంస్కృతి.

editor

Related Articles