యానిమల్ విజయం నా విజయమే-త్రిప్తి డిమ్రీ

యానిమల్ విజయం నా విజయమే-త్రిప్తి డిమ్రీ

‘యానిమల్‌’కి ముందు కూడా త్రిప్తి డిమ్రీ సినిమాలలో యాక్ట్ చేసింది. కానీ గుర్తింపు రాలేదు. ‘యానిమల్‌’ తర్వాత రాత్రికి రాత్రి స్టార్‌ అయి కూర్చుంది. రీసెంట్‌గా ఈ అందాలభామ మరో అఛీవ్‌మెంట్‌ కూడా సాధించింది. బాలీవుడ్‌లో తన తోటి హీరోయిన్లందర్నీ వెనక్కు నెట్టి నంబర్‌వన్‌గా నిలిచింది. ఇది ఎలా సాధ్యం? అనుకుంటున్నారా!.. అసలు విషయం ఏంటంటే.. అసలే బాలీవుడ్‌లో స్టార్ట్స్‌ తాకిడి ఎక్కువ. వారందరినీ దాటుకొని గూగుల్‌ సెర్చ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది త్రిప్తి డిమ్రీ. ఇది కూడా తక్కువ విషయమేం కాదు. ఈ పరిణామంపై తెగ సంబరపడిపోతోంది ఈ అందాలభామ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా గురించి తెలుసుకోవాలని ఇంతమంది ఉత్సాహపడ్డారంటే అది నిజంగా నా విజయమే. ఈ క్రేజ్‌కి కారణం ‘యానిమల్‌’. థ్యాంక్యూ సందీప్‌ సార్‌. ‘యానిమల్‌ 2’ కోసం ఎదురు చూస్తున్నా. అందులోనూ అందరూ మెచ్చేలా నా పాత్ర ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రీ.

editor

Related Articles