ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2 – శౌర్యాంగపర్వం’ను కూడా ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలో వారందరికోసం ‘సలార్ 2’ అప్‌డేట్‌ని ఇచ్చేశారు ప్రశాంత్‌నీల్. ఆయన మాట్లాడుతూ ఎక్కడో ‘కేజీఎఫ్’ ఛాయలు ఆ సినిమాలో కనిపిస్తుంటాయి. ‘సలార్ 2 – శౌర్యాంగపర్వం’లో మాత్రం ఆ తప్పు జరగదు. ఓ కొత్త సినిమాను ప్రేక్షకులు చూస్తారు. అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఈ కథ రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇది దేవా- వరదా అనే ఇద్దరు స్నేహితుల కథ. ఒకరినొకరు అపార్థం చేసుకోవాలి. శత్రువులుగా మారాలి. ఆ తర్వాత ఏమైంది? అనేది తెరపైనే చూడాలి. దాన్ని ఇప్పుడే ఏమీ చెప్పలేను. అంటూ నవ్వేశారు ప్రశాంత్‌నీల్.

- December 23, 2024
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor