ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ స్నేహ. 2000 నుండి 2020 వరకు హీరోయన్‌గా చాలా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకునేది. ఎక్కడా కూడా అశ్లీలతకి చోటు లేకుండా సినిమాలలో తన పాత్రలు ఎంచుకునేది. అయితే సినిమాలలో కొనసాగుతున్న సమయంలోనే స్నేహ 2012 మే 11న ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. తమిళ సినిమా షూటింగ్‌లో కలుసుకున్న వీరు, ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టాలీవుడ్‌లో సావిత్రి, సౌందర్య తరువాత అంత పద్దతిగల హీరోయిన్‌గా స్నేహకు మంచిపేరు ఉంది. తాజాగా స్నేహకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో స్నేహ తన భర్తతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకి ఓసీడీ ఉందని తెలిపింది. దానికి వెంటనే రియాక్ట్ అయిన స్నేహ భర్త ప్రసన్న.. అవును ఇల్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ 3 సార్లు ఇళ్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటైర్ వేశాడు.

- March 14, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor