రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా అప్‌డేట్ కోసం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందోనని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. జనవరిలో పట్టాలెక్కనుందని గతంలోనే వార్తలొచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను మొదలుపెడతారని తెలిసింది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించారని వార్తలొస్తున్నాయి. కీరవాణి సంగీతాన్నందించనున్న ఈ సినిమాని కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు.

- January 2, 2025
0
122
Less than a minute
You can share this post!
editor