ముంబైలో ఈ నెల 16న జరిగిన దాడి సమయంలో తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రానాను సైఫ్ అలీ ఖాన్ కలిశాడు. దాడి జరిగిన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి తన ప్రాణాలను కాపాడిన భజన్ సింగ్ రానాను ఇంటికి పిలిపించుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు సైఫ్ అలీఖాన్. భజన్ సింగ్‌తో సైఫ్ అలీఖాన్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీఖాన్ కుర్తా మొత్తం రక్తంతో తడిసిముద్దైపోయిందని, కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఇదివరలో మీడియాకు చెప్పారు. సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తన వద్ద ఉన్న పదునైన కత్తితో హీరోను పొడిచాడు. సుమారు ఆరు చోట్ల బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు లీలావతి ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. రెండు చోట్ల మాత్రం ఆ కత్తి పోట్లు చాలా డీప్‌గా ఉన్నాయని.. ఒక కత్తిపోటు సైఫ్ వెన్నుపూస సమీపంలో డీప్‌గా దిగినట్లు చెప్పారు. మెడ, చేయి, వెన్నులో ఓ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలిపారు. వెన్నులో దిగిన వస్తువును సర్జరీ ద్వారా తొలగించి అతి కష్టమైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్లు చెప్పారు.

- January 22, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor