కోలీవుడ్ హీరో, పద్మ భూషణ్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజై ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇటీవల అజిత్ సినిమాల కన్నా కూడా మోటార్ రేసింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాడు. మోటర్ రేసింగ్‌లో తల ఎన్నిసార్లు గాయపడ్డా కూడా దానిని వీడడం లేదు. అయితే తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎప్పుడు నటన నుండి వైదొలుగుతానో తెలియదు. బలవంతంగా వీడాల్సి రావచ్చు. నేను ఏ విషయాన్నైన కూడా తేలికగా తీసుకోకూడదు అనుకుంటున్నా. ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేస్తారేమో, అప్పుడు వైదొగలగక తప్పదు. ఒకవేళ నన్ను అంతా ఆదరిస్తున్నప్పుడే తప్పుకుంటానేమో. జీవితం చాలా విలువైనది. నేను నా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా స్నేహితులు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు జీవితం విలువ ఏంటో అర్ధమవుతుంది. సమయాన్ని వృధా చేయకుండా నా లైఫ్‌లోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నా అని అజిత్ అన్నారు. స్కూల్ చదువుల తర్వాత ఆటోమొబైల్ రంగంలో పని చేశాను` అని అజిత్ తెలిపారు. 18 ఏళ్లు ఉన్నపుడు రేసింగ్ స్టార్ట్ చేశాను. ఓ రోజు నేను రేస్ ట్రాక్‌లో ఉండగా.. మోడల్ కోఆర్డినేటర్ నా దగ్గరకు వచ్చి మోడలింగ్‌లో ఆసక్తి ఉంటే తనను కలవమని ఓ కార్డ్ ఇచ్చి వెళ్లాడు. రేసింగ్ కోసం డబ్బులు వస్తాయి కాబట్టి ఓకే చెప్పాను. మోడలింగ్‌లో వచ్చిన డబ్బుల్ని రేసింగ్ కోసం వాడేవాడిని. ఓ సారి తెలుగు సినిమా ఆడిషన్‌కు కాల్ రాగా, నాకు తెలుగు రాదు కాబట్టి నేర్చుకున్నా. మా కుటుంబానికి సినిమాలతో అస్సలు సంబంధం లేదు కాబట్టి వారు భయపడ్డారు. వారికి నచ్చజెప్పి సినిమాల్లోకి వెళ్లా. వ్యాపారంలో బాగా దెబ్బతినటం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాను.. నా యాస కారణంగా కూడా చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. పట్టుదలతో అన్నిటిపై పట్టు సాధించాను. సినిమాల విషయంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను అంటూ అజిత్ పేర్కొన్నారు.
- May 2, 2025
0
106
Less than a minute
Tags:
You can share this post!
editor

