నాలుగేళ్ల క్రితం ముంబైలోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్. వ్యక్తిగత కారణాల వల్ల ఒత్తిడికి లోనై ఆయన సూసైడ్ చేసుకున్నట్లు అధికారికంగా పోలీసులు చెప్పారు. ఆత్మహత్య ఉదంతం తర్వాత సుశాంత్ ఇంటిని కొనుక్కోడానికి ఎవరూ ముందుకు రాలేదు, ధైర్యం చేయలేదు.
సుమారు 4 ఏళ్లు ఖాళీగా ఉన్న ఆ ఇంటిని ఈ మధ్యే కొనుగోలు చేసింది ఆదాశర్మ. ఇంటిని పూర్తిగా రీమోడలింగ్ చేసి ఇటీవల కుటుంబంతో సహా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయింది. ఈ నేపథ్యంలో సుశాంత్ ఇంటిని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఆదాశర్మ. కేవలం పబ్లిసిటీ కోసమే తాను ఆ ఇల్లును కొన్నాననే ఆరోపణలను పటాపంచలు చేసింది. సుశాంత్ ఇల్లు తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ, ఆ ఇంట్లో అడుగుపెట్టగానే పాజిటివ్‌గా వైబ్రేషన్స్ వచ్చాయని, ఏదో తెలియని శక్తి ఇంట్లో ఉందనే భావన కలిగిందని చెప్పింది. ఇంటిని మొత్తం రీమోడలింగ్ చేశా. మొదటి అంతస్తుని గుడిగా చేశాను. టెర్రస్‌పై గార్డెన్‌ను పెంచి చిన్న చిన్న పూల మొక్కలు పెంచుతున్నా. మా అమ్మ, అమ్మమ్మతో కలిసి ఇక్కడే ఉంటున్నా అని ఆదాశర్మ తెలిపింది.