డైరెక్టర్: వేణు – నితిన్‌తో దిల్‌రాజు సినిమా?

డైరెక్టర్: వేణు – నితిన్‌తో దిల్‌రాజు సినిమా?

హీరో నితిన్‌ ఓ మంచి స్టోరీకి ఓకే చెప్పినట్టు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వార్త బలంగా స్ప్రెడ్ అయింది. ఇప్పటివరకూ లవ్‌, యాక్షన్‌ కథలతో అలరించిన నితిన్‌కు ఇదో కొత్త వెరైటీ సినిమా. ఇంతకీ ఆ కథ ఏమిటి అంటే? ఆ విషయానికొస్తే.. ‘బలగం’తో ఊహకందని విజయాన్ని అందుకున్న కమెడియన్‌ వేణు ఎల్దెండి.. ఆ చిత్రం తెచ్చిపెట్టిన ఇమేజ్‌కి తగ్గట్టుగానే, మలి ప్రయత్నంగా ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించే ప్రయోగాత్మక కథను తయారు చేసుకున్నారట. ఆ కథే ‘ఎల్లమ్మ’. ఈ కథను నాని, శర్వానంద్‌లకు కూడా వేణు వినిపించారట. వారికి కథ నచ్చినా, అప్పటికే చేతిలో ఉన్న సినిమాల వల్ల ఓకే చేయలేకపోయారు. చివరకు బంతి నితిన్‌ కోర్ట్‌లో పడింది. నితిన్‌ ఈ కథను ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారని తెలుస్తోంది. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. దిల్‌రాజు బ్యానర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే నిజమైతే.. తొలి సినిమా ‘దిల్‌’ తర్వాత నితిన్‌తో చేస్తున్న దిల్‌రాజు సినిమా రెండోది ఇదే ఔతుంది.

administrator

Related Articles