ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారాయన. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలావుంటే.. తాజాగా బాలయ్య సినిమాల లైనప్ విషయంలో ఓ కొత్త వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవలే బాలకృష్ణను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలిశారట. వారిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా దాదాపు ఖరారైందని సమాచారం. మలినేని సినిమాతోపాటే ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఒకేసారి కానిచ్చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. మరో విషయం ఏంటంటే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే సినిమా ద్వారానే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. కథలో ఓ కీలక భూమికను మోక్షజ్ఞ పోషిస్తారట. 30 ఏళ్ల క్రితం ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించేవారు బాలకృష్ణ. బాలయ్య మళ్లీ స్టైల్ మార్చారు. పాతరోజుల్ని గుర్తొకు వచ్చేలా పనిచేయాలని నిర్ణయించారు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది పండుగలాంటి వార్తే.
- May 9, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor

