‘లైలా’ సినిమా విషయంలో పృథ్వీ కామెంట్స్ వివాదమే: బ్రహ్మజీ

‘లైలా’ సినిమా విషయంలో పృథ్వీ కామెంట్స్ వివాదమే: బ్రహ్మజీ

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్య‌లు వివాదాస్పదం అయిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించారు న‌టుడు బ్రహ్మజీ. విష్వక్‌సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా సినిమా లైలా. ఈ సినిమాకు రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. సాహు గారపాటి నిర్మించాడు. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుక‌గా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో న‌టుడు పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్య‌లు వివాదాస్పదం అయిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా అభిమానులు అత‌డిని ట్రోల్ చేయ‌డంతో పాటు లైలా సినిమాను బాయ్‌కాట్ చేస్తామ‌ని ఎక్స్‌లో ట్రెండ్ చేశారు. దీంతో దిగొచ్చిన చిత్ర‌బృందం క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. ఇదిలావుంటే తాజాగా ఈ వివాదంపై న‌టుడు బ్రహ్మజీ స్పందించాడు. ఈ విష‌యంపై బ్రహ్మజీ మాట్లాడుతూ.. లైలా విష‌యంలో పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తప్పు. పృథ్వీ ఒక సినిమా వేడుక‌కు వ‌చ్చి అలా మాట్లాడి ఉండ‌కూడ‌దు. పృథ్వీ విష‌యంలో అతడిని టార్గెట్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్.

editor

Related Articles