బెనిఫిట్ షోలకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. భవిష్యత్‌లో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ వెల్లడించింది. సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు సంబంధించిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా.. ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. సంక్రాంతి సమయంలో సినిమా టికెట్ ధరలను పెంచుకోడానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. ఇక ప్రభుత్వం తరపు వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలకి అనుమతి లేదంటూ తెలిపింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం.. అర్ధరాత్రి గం.1.30 నిమిషాల నుండి ఉ.గం.8.40 నిమిషాల వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని… ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. తెలంగాణలో ఇకముందు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడం వంటివి రద్దయినట్లు తెలుస్తోంది.
											- January 25, 2025
 
				
										 0
															 79  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				
