రెండు దశాబ్దాల క్రితం ప్రేమకథా సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పించింది ‘7జీ బృందావన కాలనీ’. దీనికి సీక్వెల్‌గా ‘7జీ బృందావన కాలనీ-2’ తెరకెక్కుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. సెల్వరాఘవన్ దర్శకుడు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఫస్ట్ పార్ట్‌లో తన నటనతో ఆకట్టుకున్న హీరో రవికృష్ణ సీక్వెల్‌లో మరోసారి తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారని, ఆయన సరసన అనశ్వర రాజన్ కథానాయికగా నటిస్తోందని మేకర్స్ తెలిపారు. బుధవారం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నేటి యువతరం అభిరుచులకు తగ్గట్టుగా సీక్వెల్‌ను రూపొందిస్తున్నామని, అప్పట్లో లాగా మ్యాజిక్‌ను రిపీట్ చేస్తామనే నమ్మకం ఉందని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు. జయరామ్, సుమన్‌శెట్టి, సుధ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా సాహిత్యాన్నందిస్తున్నారు.
- January 2, 2025
0
169
Less than a minute
You can share this post!
editor

