ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ YS షర్మిల హీరో ప్రభాస్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ అంటే ఎవడో తనకు తెలియదని వెల్లడించింది. ప్రభాస్‌కి షర్మిలకి మధ్య రిలేషన్షిప్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. తనకు అసలు ప్రభాస్ అంటే ఎవరో తెలియదని.. నాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఆరోజు అదే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. తాను ఎవరో నాకు తెలియదు. ఈ విషయంపై నా పిల్లల మీద కూడా ప్రమాణం చేశాను. ఈ విషయంపై జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండి కూడా దీనిపై విచారణ జరిపించలేదు. బాలకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నేను అడుగుతున్నా. నీకు నిజంగానే చెల్లెలి మీద ప్రేమ ఉంటే.. బాలకృష్ణ నా మీద ప్రభాస్ మీద ఆరోపణలు చేసినప్పుడు ఏం చేశావు. అప్పుడు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను కేసు పెట్టినప్పుడు కూడా జగన్ దీనిపై అసలేమీ స్పందించలేదంటూ షర్మిల వెల్లడించింది.
- November 22, 2024
0
267
Less than a minute
You can share this post!
administrator

