‘ఆర్‌సీ16’లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టుడు దివ్యేండు శ‌ర్మ.?

‘ఆర్‌సీ16’లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టుడు దివ్యేండు శ‌ర్మ.?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌  కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స‌నా దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేక‌ర్స్. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ న‌టుడు దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మీర్జాపూర్‌లో మున్నా భ‌య్యా పాత్ర‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దివ్యేండు. దీంతో ‘ఆర్‌సీ16’ సినిమాలో అత‌డిని తీసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

editor

Related Articles