తమిళ దర్శకుడు మురుగదాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం గజిని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇదే చిత్రం బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో తెరకెక్కించాడు మురుగదాస్. హిందీలో కూడా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన తుపాకి, కత్తి వంటి డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూశారు. అయితే ఆయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన స్పైడర్ చిత్రం మాత్రం అనుకున్న విజయం సాధించలేదు. మహేష్‌బాబు హీరోగా చేసిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. అయితే మురుగదాస్ కథకుడుగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆయన కథలు అందరినీ ఆలోచింపజేసే విధంగా వుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నా స్నేహితులు నన్ను పుస్తకాల పురుగు అంటారు. నా చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం వుండాల్సిందే. మొబైల్‌ను మరిచిపోతానేమో కానీ పుస్తకాన్ని మాత్రం మరిచిపోను. ఓషో రచించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను. జయమెహన్, వైరముత్తు, భారతియార్ వంటి వారి సాహిత్యం అంటే చాలా ఇష్టం. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన ఏ మంచి పుస్తకం వదిలిపెట్టను. ఎక్కడైనా పుస్తక ప్రదర్శనలు జరిగితే అక్కడకి చేరుకుంటాను. సోషల్‌మీడియా ప్రభావంతో పుస్తకాలకు ఆమడ దూరంలో వుండే ఈ రోజుల్లో పుస్తక పఠనం అనేది అలవాటుగా, వ్యసనంగా మార్చుకున్న మురుగదాస్ ఎంతైనా గ్రేట్ కదా…

- October 16, 2024
0
103
Less than a minute
Tags:
You can share this post!
administrator