‘MAGIC’ సినిమా ‘జెర్సీ’ ద‌ర్శ‌కుడు డైరెక్షన్‌లో?

‘MAGIC’ సినిమా ‘జెర్సీ’ ద‌ర్శ‌కుడు డైరెక్షన్‌లో?

జెర్సీ  సినిమాతో డైరెక్ట‌ర్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్. ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. అయితే జెర్సీ వచ్చి 5 ఏళ్లయినా గౌత‌మ్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు, లాంగ్ బ్రేక్ తీసుకున్నారు.

గ‌త ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దేవరకొండతో గౌత‌మ్ VD12 అంటూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, అది పాత విషయమే. ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూట్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా స్టార్ట్ చేసే గ్యాప్‌లో గౌత‌మ్ తిన్న‌నూరి ఒక చిన్న (బడ్జెట్) సినిమాకు ద‌ర్శ‌కత్వం కూడా చేశారు. ఆయన డైరెక్షన్‌లో వ‌స్తున్న తాజా చిత్రం మేజిక్. సంగీత నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమా నుండి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ వచ్చింది.. మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది.  తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ సినిమాను డిసెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నాగ‌వంశీ నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు.

administrator

Related Articles