జూ. ఎన్టీఆర్ దేవర హిందీ వర్షన్ దుమ్మురేపుతోంది. బాక్సాఫీస్ వద్ద రెండో వారం అద్భుతమైన కలెక్షన్లతో ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల గ్రాస్ దాటబోతోంది. ఊహించని విధంగా హిందీలో దూసుకుపోతోంది. 10 రోజుల్లో ఇండియాలోనే రూ. 243.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒక్క హిందీ బెల్ట్ నుండి రూ. 52.75 కోట్లతో ఘనతను సాధించినట్టు ట్రేడ్ వెబ్సైట్ సక్నిల్క్ నివేదించింది. రెండో ఆదివారం, దేవర ఇండియాలో 12 కోట్లు రాబట్టింది. రెండో శనివారం నుండి దాదాపు 30% వ్యూయర్స్ పెరగడం విశేషం.
- October 7, 2024
0
310
Less than a minute
You can share this post!
administrator

