గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్

గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో కనిపించనున్నారు. లార్డ్స్ మైదానంలో నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం అనంతరం బాల్కనీలో షర్ట్‌ను గాల్లో ఊపుతూ గంగూలీ చేసిన ఐకానిక్ సెలబ్రేషన్‌ను గుర్తు చేసేలా పోస్టర్‌ను డిజైన్ చేయడంతో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఆధ్వర్యంలోని టి- సిరీస్‌తో పాటు DBL సంస్థ ఈ సినిమాని సమర్పిస్తోంది. సాధారణ క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించి, భారత జట్టుకు దూకుడు నింపిన కెప్టెన్‌గా ఎదిగిన సౌరవ్ గంగూలీ ప్రయాణాన్ని ఈ బయోపిక్‌లో ఆవిష్కరించనున్నారు. భారత క్రికెట్ మైండ్‌సెట్‌ను మార్చిన నాయకుడిగా గంగూలీ ప్రభావాన్ని కూడా సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను 2027 మే 14న ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Related Articles