ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్ షో?

ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్ షో?

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో లెజెండరీ నటుడు కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్నారు. అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైందని, వచ్చే వారం ఘట్టమనేని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రివ్యూ షో నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రదర్శనకు మహేష్ బాబు కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశముందని, మహేష్ బాబు బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన కోసం ప్రత్యేకంగా మరో షో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తిరుపతి నేపథ్యంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. కథలో ఆధ్యాత్మికతతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Related Articles