శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్?

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై అనిశ్చితి నెలకొంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో ఆమె హిందీ అరంగేట్రం చేయాల్సి ఉన్నా, సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీలీల సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన ‘దిలేర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నిర్ణయం శ్రీలీలకు సవాల్‌గా మారవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్‌తో సినిమా చేస్తే స్టార్ హీరోతో గ్రాండ్ లాంచ్ లభించే అవకాశం ఉండగా, ఇబ్రహీం అలీ ఖాన్‌కు ఇప్పటివరకు థియేట్రికల్ మార్కెట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related Articles