పరశురామ్-హృతిక్ కాంబో ఫిక్స్?

పరశురామ్-హృతిక్ కాంబో ఫిక్స్?

‘గీత గోవిందం’తో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన పరశురామ్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కోసం ఓ భారీ పాన్ ఇండియా కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ చిత్రాల తర్వాత ‘గీత గోవిందం’తో పరశురామ్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ లభించింది. అనంతరం మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ కమర్షియల్‌గా విజయవంతమైనప్పటికీ, ‘ది ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం సాధించలేదు. దీంతో గత రెండేళ్లుగా కొత్త కథల అభివృద్ధిపైనే ఆయన దృష్టి పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్ కోసం యాక్షన్- ఎమోషనల్ డ్రామా కథను పరశురామ్ సిద్ధం చేశారని, ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించగా హృతిక్ కూడా ఆసక్తి చూపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అలాగే ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి చిత్రాలను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related Articles